రుచి చూచి యెరిగితిని - యెహోవా ఉత్తముడనియు
ruchi chuuchi yerigitini - yehoovaa uttamuddaniyu
పల్లవి
రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని
1వ చరణం
గొప్పదేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే తప్పక ఆరాధింతు - దయాళుడవు నీవే
2వ చరణం
మహోన్నతుడగు దేవా - ప్రభావము గలవాడా మనసార పొగడెదను నీ - ఆశ్చర్య కార్యములన్
3వ చరణం
మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో ముదమార పాడెద నిన్ను - అతి సుందరుడవనియు
4వ చరణం
నా జీవితమంతయును - యెహోవాను స్తుతించెదను నా బ్రతుకు కాలములో నా- దేవుని కీర్తింతున్
5వ చరణం
సంతోషించెద నెల్లపుడు - కష్ట ధు:ఖ భాధలలో ఎంతో నెమ్మది నిచ్చు నా - రక్షకుడు నాయేసు
6వ చరణం
ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిదిలో చేరి సంపూర్ణముగా పొందెదను - అడుగు వాటన్నిటిని
7వ చరణం
కృతజ్నత చెల్లింతు - ప్రతి దాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను