సాగిల పడి మ్రొక్కెదము - సత్యముతో ఆత్మాలో

saagila paddi mrokkedamu - satyamutoo aatmaaloo

🎵 TG-1237💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

మన ప్రభు యేసునీ ఆ..ఆ..ఆ...

1వ చరణం

మోసే కంటే శ్రేష్టుడు - అన్ని మోసముల నుండి విడిపించున్‌ వేషధారులను ద్వేషించున్‌ - ఆశతో మ్రెక్కెదము " సాగిల"

2వ చరణం

అహరోను కంటే శ్రేష్టుడు - మన ఆరాధనకు పాత్రుండు ఆయనే ప్రదాన యాజకుడు - అందరము మ్రొక్కెదము "సాగిల"

3వ చరణం

ఆలయము కన్న శ్రేష్టుడు - నిజ ఆలయముగ తానే యుండెన్‌ ఆలయము మీరే యనెను - ఎల్ల కాలము మ్రొక్కెదము "సాగిల"

4వ చరణం

యోనా కంటే శ్రేష్టుడు - ప్రాణధానముగా తన్ను అర్పించెన్‌ మానవులను విమోచించెన్‌- ఘనపరచి మ్రొక్కెదము "సాగిల"

5వ చరణం

సొలోమొను కన్న శ్రేష్టుడు - సర్వ జ్ఞానమునకు ఆధారుండు పది వేలలో అతి ప్రియుండు - పదిలముగా మ్రొక్కెదము "సాగిల"

6వ చరణం

రాజుల కంటే శ్రేష్టుడు - యాజకులనుగా మనలను చేసెను రారాజుగ త్వరలో వచ్చున్‌ - - రయముగను మ్రొక్కెదము "సాగిల"

7వ చరణం

అందరిలో అతి శ్రేష్టుడు - మన కందరికి తానే ప్రభువు హల్లేలూయకు పాత్రుండు - అను దినము మ్రొక్కెదము "సాగిల"

Report Error