సద్భక్తితోడ సాక్షులై నిత్య విశ్రాంతి
sadbhakthithooda saakssulai nithya vishraanthi
పల్లవి
సద్భక్తితోడ సాక్షులై నిత్య విశ్రాంతి నొందు వారిఁ జూడఁగా శ్రీ యేసు నామమున్ స్తుతింతుము హల్లెలూయా! జేయు
1వ చరణం
పోరాటమందు వారి దుర్గమౌ శ్రీ యేసు సంరక్షించు శైలము అంధత్వ మందు జీవకాంతియు హల్లెలూయా! ||సద్భక్తితోడ సాక్షులై||
2వ చరణం
ఓ యోధులారా! ధైర్యశాలురై పూర్వులఁ బోలి యుద్ధ మాడుఁడీ జీవ కిరీటంబు మీ కబ్బును హల్లెలూయా! ||సద్భక్తితోడ సాక్షులై||
3వ చరణం
ఓ దివ్యసభ! స్నేహభావులు! అన్యోన్య సహవాసమున్ నమ్మిక గల క్రీస్తువారలు! హల్లెలూయా! ||సద్భక్తితోడ సాక్షులై||
4వ చరణం
మోక్షంబుఁ జేరి భక్తు లెల్లరు పితృ పుత్ర శుద్ధాత్మలన్ సదా విజయ గీతితో ఁ గీర్తింతురు హల్లెలూయా! ||సద్భక్తితోడ సాక్షులై||