సమృద్ధి జీవము సంపత్తి నాకుఁగా

samruddhi jeevamu sanpaththi naakumgaa

🎵 TG-452💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

సమృద్ధి జీవము సంపత్తి నాకుఁగా సంతప్త మొందుచుఁ చావును బొందితి నాకై చావొందితి నీకై యేమి చేతున్?

1వ చరణం

నెమ్మయిన రాజ్యము నేనొందు లాగున నీ నెత్రు కార్చుచు నీ ప్రాణ మిచ్చితి నా యాత్మఁ బ్రోచితి నీకేమి యిత్తును? ||సమృద్ధి జీవము||

2వ చరణం

నీ తండ్రి యింటిని నీ సింహాసనమున్ నీ గౌరవంబును నీ వన్ని మానితి యన్ని త్యజించితి నీ కేమి త్యజింతున్? ||సమృద్ధి జీవము||

3వ చరణం

నాశంబునుండి నన్ రక్షించుటకును లెక్కింప శక్యము కాని విచారమై నీ శ్రమ లోర్చితి నీకై నేనోర్తునా? ||సమృద్ధి జీవము||

4వ చరణం

నా పాప మన్నింపున్ రక్షణ్య మార్గము అక్షయ భాగ్యము నాశించి తెచ్చితి నా కన్ని తెచ్చితి నీకేమి తెచ్చెదన్? ||సమృద్ధి జీవము||

Report Error