సందేహమేల సంశయమదేల ప్రభు యేసు
sandeehameela sanshayamadeela prabhu yeesu
🎵 TG-2702🌐 Telugu
పల్లవి
సందేహమేల సంశయమదేల ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2) ||సందేహమేల||
1వ చరణం
ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే నీ పాప శిక్షను తానే – భరియించెనే (2) ప్రవహించె రక్త ధార నీ కోసమే కడు ఘోర హింసనొందె నీ కోసమే ఎందాక యేసుని నీవు – ఎరగనందువు ఎందాక హృదయము బయట – నిలవమందువు యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా ఈ లోక భోగములను – వీడజాలవా సాతాను బంధకమందు – సంతసింతువా యేసయ్య సహనముతోనే చెలగాటమా ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా లోకాన ఎవ్వరు నీకై – మరణించరు నీ శిక్షలను భరియింప – సహియించరు నీ తల్లియైన గాని నిన్ను మరచునే ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా