సంఘ శిరసై వెలయు ప్రభువా

sangha shirasai velayu prabhuvaa

🎵 TG-263💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

సంఘ శిరసై వెలయు ప్రభువా సత్యకృప సంపూర్ణ ప్రభావా సర్వ క్రైస్తవ సంఘ మహి మా స్త్రోత్రగీతల్ స్వీకరింపుమా ||సంఘ శిరసై||

1వ చరణం

సంఘ యస్థిభారము వీవే సంఘ జీవాధారము నీవే సర్వ జనరక్షణము నీవే సర్వలోక నిరీక్షణ నీవే ||సంఘ శిరసై||

2వ చరణం

తరణి చుట్టు తారాగ్రహములు పరివృత్తంబై తిరుగు రీతిని తల యె క్రీస్తయ తనువే భక్తులై తగిన సఖ్యత నైక్యత నుందురు ||సంఘ శిరసై||

3వ చరణం

నూతనాత్మ నూతన జన్మ నీతి సేవా నిరతియు గలిగి నిత్య మాతనియందు నిలచి నెగడు వారే నిజక్రైస్తవులు ||సంఘ శిరసై||

4వ చరణం

ఆత్మశుద్ధి అనుపమబుద్ధి అమలవర్తన మనిశము గలిగి ఆత్మఫలములు జాపన నేర్చిన యను భవంబే క్రైస్తవంబు ||సంఘ శిరసై||

5వ చరణం

విశ్వసింతుము నిన్నే మేము విమల జీవ ప్రదాయకుండ వరుడనీవై వరదుడ వీవై విశ్వ భారతి నుద్ధరింపుమా ||సంఘ శిరసై||

Report Error