సన్నుతింతు యేసు స్వామి నిన్ను
sannuthinthu yeesu svaami ninnu
🎵 TG-1700🌐 Telugu
పల్లవి
సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం నీ మహాత్య కార్యములను పాడి వివరింతును (2) శోధన వేదన కష్ట సమయాన – నా తోడుగా నుందువు ఆశ్చర్య కార్యములు ఆనంద ఘడియలు – ఎన్నడు మరువను ||సన్నుతింతు||
1వ చరణం
సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు కరుణా కటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు నా దోషములన్నిటిని క్షమియించినావు – కరుణ సమృద్ధుడవు మేలులతో నా హృదయం తృప్తిపరచావు – నీకేమి చెల్లింతును ||సన్నుతింతును||
2వ చరణం
మహిమైశ్వర్యముల మహారాజు మహిమతో నింపును శాంతి రాజ్య స్థాపకుడు తన శాంతి నిచ్చును అడిగిన వారికి కాదనకుండ వరములు కురిపించును యేసయ్య నీ గొప్ప నామము స్మరియింప – నాకెంతో భాగ్యము