సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ
sanvathsaramulu veluchundagaa nithyamu nee
🎵 TG-2272🌐 Telugu
పల్లవి
సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా నీకే వందనం నను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నను రక్షించిన యేసయ్యా (2) ||సంవత్సరములు||
1వ చరణం
గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు (2) శత్రువల నుండి విడిపించినావు సంవత్సరమంతా కాపాడినావు (2) ||నీకే||
2వ చరణం
బ్రతుకు దినములన్ని ఏలియా వలె నీవు పోషించినావు పాతవి గతియింప చేసి నూతన వస్త్రమును ధరియింపజేశావు నూతన క్రియలతో నను నింపినావు సరి కొత్త తైలముతో నను అంటినావు