సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
sarvaanga sundaraa sadgunna sheekharaa
పల్లవి
యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా పరవశించి పాడుచూ పరవళ్ళుత్రొక్కెద -2
1వ చరణం
నా ప్రార్ధన ఆలకించు వాడా - నా కన్నీరు తుడుచు వాడా నా శోదనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా "సర్వాంగ'
2వ చరణం
నా శాపములు బాపి నావా - నా ఆశ్రయ పురమైతివా నా నిందలన్నిటిలో యెహోషపాతువై నాకు న్యాయము తీర్చితివా "సర్వాంగ"
3వ చరణం
నా అక్కరలు తీర్చి నావా - నీ రెక్కల నీడకు చేర్చి నావా నా అపజయములన్నిటిలో యెహోవ నిస్సివై నా జయ ధ్వజమైతివా "సర్వాంగ"