సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే
sarvachiththanbu needeenayyaa svaruupamichchu kummarivee
పల్లవి
సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే సారెపై నున్న మాంటినయ్యా సరియైన పాత్రన్ జేయుమయ్యా సర్వేశ్వరా నేరిక్తుండను సర్వదా నిన్నే సేవింతును ||సర్వచిత్తంబు నీదేనయ్యా||
1వ చరణం
ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి పరికింపు నన్నీదివసంబున పరిశుభ్రమైన హిమముకున్న పరిశుద్ధున్ జేసి పాలింపుమా పాపంబుబోవ నను గడుగుమా ||సర్వచిత్తంబు నీదేనయ్యా||
2వ చరణం
నీ చిత్తమే సిద్ధించు ప్రభూ నిన్నే ప్రార్థింతు నా రక్షకా నీచమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ నిజమైన సర్వశక్తుండవే నీ చేతబట్టినన్ రక్షింపుమా ||సర్వచిత్తంబు నీదేనయ్యా||
3వ చరణం
ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహపరమున అధికంబుగా నన్నీ యాత్మతో ఆవరింపుమో నా రక్షకా అందరూ నాలో క్రీస్తుని జూడ ఆత్మతో నన్ను నింపుము దేవా ||సర్వచిత్తంబు నీదేనయ్యా||