సర్వకృపానిధి యగు ప్రభువా - సకల చరాచర సంతోషమా
sarvakrupaanidhi yagu prabhuvaa - sakala charaachara santoossamaa
పల్లవి
స్తోత్రము చేసి స్తుతించెదము - సంతోషముతోనిను పొగిడెదము హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ..హల్లెలూయ.. హల్లేలూయ యని పాడెదము... ఆనందముతో సాగెదము
1వ చరణం
ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నను రక్షించితివి పరిశుద్దముగ జీవించుటకై - పాపిని ననుకరుణించితివి "హల్లె"
2వ చరణం
అల్పకాల శ్రమలనుభవింప - అనుదినము కృపనిచ్చితివి నాధుని అడుగు జాడలలో - నడుచుటకు నను పిలచితివి "హలె"
3వ చరణం
మరణ శరీరము మార్పునొంది - మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి - మరణభయములను తీర్చితివి "హల్లె"
4వ చరణం
భువి నుండి శ్రేష్టఫలముగను - దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూజనములలోనుండి నన్ను - ప్రేమించి క్రయ ధనమిచ్చితివి "హల్లె"
5వ చరణం
ఎవరు పాడని గీతములు - యేసుతో నేను పాడుటకై హేతువు లేకయే ప్రేమించెన్ - యేసుకు నేనేమివ్వగలన్ "హల్లె"