శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన
shaashvathamainadi neevu naayeda chuupina
🎵 TG-2405🌐 Telugu
పల్లవి
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె (2) కాచిన కృప ||శాశ్వతమైనది||
1వ చరణం
నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) ||శాశ్వత||
2వ చరణం
తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన నా కృప నిను వీడదని అభయమిచ్చితివే