శ్రీ రక్షకుని నామము కీర్తించి
shree rakssakuni naamamu keerthinchi
పల్లవి
శ్రీ రక్షకుని నామము కీర్తించి కొల్వుఁడీ కిరీట ముంచి చాటుఁడి -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
1వ చరణం
పరేశుహత సైన్యమా మీ రాజు ఈయనే కిరీట ముంచి చాటుఁడి -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా! ||శ్రీ రక్షకుని||
2వ చరణం
నరులారా! మీ కోసము చావును నొందెను కిరీట ముంచి చాటుఁడి -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా! ||శ్రీ రక్షకుని||
3వ చరణం
సర్వ జనాంగములారా! శరణ్యుఁ డీయనే కిరీట ముంచి చాటుఁడి -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా! ||శ్రీ రక్షకుని||
4వ చరణం
పరంబునందు యేసుకుఁ కిరీట ముంచుచు హర్షంబుతోఁ గీర్తింతుము -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా! ||శ్రీ రక్షకుని||