శ్రీ వినోద దాయకంబు దేవుని

shree vinooda daayakanbu deevuni

🎵 TG-257💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

శ్రీ వినోద దాయకంబు దేవుని వాక్యంబు జీవమునకు నాస్పదంబు చిరమగు ధనంబు భావంబుల మార్చు నంబు బహుళ సాధనంబు ||శ్రీ వినోద||

1వ చరణం

పాప తతికి నాయుధంబు పాపి కాశ్రయంబు భూపతులకు దుస్తరంబు పుణ్య సాధనంబు శాప మడంచెడు శరంబు జగతికి విభవంబు ||శ్రీ వినోద||

2వ చరణం

స్వాతంత్ర్య మిడు దనంబు సర్వశ్రేయంబు ఘాతకులకు ఖడ్గంబు నీతికినిలయంబు ప్రీతిని గరపెడు విధంబు ఖ్యాతికిఁ బథంబు ||శ్రీ వినోద||

3వ చరణం

సత్య విరాజితంబు నిత్య శోభితంబు భృత్య వరుల సంచకరము భీతున కభయంబు చేతో విభవంబు సుగుణ శిష్యుల హారంబు ||శ్రీ వినోద||

4వ చరణం

కర్తఁ జూపు నద్దంబు ఘనమహాద్భుతంబు దురితతతికి నస్త్రంబు దు ఖశోషణంబు పరమోపదేశంబు బహుళమానితంబు ||శ్రీ వినోద||

5వ చరణం

సర్వజనులకును హితంబు సౌఖ్యసాధనంబు శాంతికి నిజమార్గంబు జగడముల హరంబు జగము నంతకును వరంబు సత్యవిజయంబు ||శ్రీ వినోద||

6వ చరణం

కోలాహల కారణంబు చాల ప్రాచీనంబు మూలమౌ ధనంబు జగము నేలెడి తంత్రంబు జాలియె దన సూత్రంబు మేలు భూషణంబు ||శ్రీ వినోద||

7వ చరణం

జ్ఞానికి దుర్ గ్రాహ్యంబు దాని బోధనంబు దీనజనుల కర్థంబు దివ్య శోభితంబు మానితభక్తిని దినంబు మానని పఠనంబు ||శ్రీ వినోద||

Report Error