శ్రీ యేసుండు జన్మించె రేయిలో
shree yeesundu janminche reeyiloo
పల్లవి
శ్రీ యేసుండు జన్మించె రేయిలో నేఁడు పాయక బెత్లెహేమ యూరిలో ||శ్రీ యేసుండు||
1వ చరణం
కన్నియ మరియమ్మ గర్భమందున ని మ్మాను యేలనెడి నామమందున ||శ్రీ యేసుండు||
2వ చరణం
సత్ర మందునఁ బశువుల సాలయందున దేవ పుత్రుండు మనుజుం డాయెనందున ||శ్రీ యేసుండు||
3వ చరణం
పట్టి పొత్తిగుడ్డలతోఁ జుట్టఁబడి పసుల తొట్టిలోఁ బరుండబెట్టఁబడి ||శ్రీ యేసుండు||
4వ చరణం
గొల్లలెల్లరు మిగుల భీతిల్లఁగ దెల్పె గొప్ప వార్త దూత చల్లఁగ ||శ్రీ యేసుండు||
5వ చరణం
మన కొఱకొక్క శిశువు పుట్టెను ధరను మన దోషములఁ బోఁగొట్టను ||శ్రీ యేసుండు||
6వ చరణం
పరలోకపు సైన్యంబుఁ గూడెను మింట వర రక్షకుని గూర్చి పాడెను ||శ్రీ యేసుండు||
7వ చరణం
అక్షయుండగు యేసు వచ్చెను మనకు రక్షణంబు సిద్ధపర్చెను ||శ్రీ యేసుండు||