శ్రీ యేసునే భజించు నా

shree yeesunee bhajinchu naa

🎵 TG-079💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

శ్రీ యేసునే భజించు నా మనసా శ్రీ యేసునే భజించు శ్రీ యేసు ప్రభునే భజించు నా మనసా శ్రీ యేసునే భజించు ||శ్రీ యేసునే||

1వ చరణం

యేసు త్రిత్వమం దీశ కుమారుఁడు భాసురుఁ డాతఁడు భూషిత రక్షకుఁడు ||శ్రీ యేసునే||

2వ చరణం

నరుల దురితస్థితిఁ గరుణించి వారికిఁ పరమ సుఖము లిడ పరికించి వచ్చిన ||శ్రీ యేసునే||

3వ చరణం

స్వామికి మహిమయు భూమికి నెమ్మది క్షేమము నియ్యను లేమిడిఁ బుట్టిన ||శ్రీ యేసునే||

4వ చరణం

నరులను తండ్రితో నైక్యము జేయగ నిరతము వేఁడెడి నిజప్రాపకుఁ డగు ||శ్రీ యేసునే||

5వ చరణం

మూఁడవ దినమున మృత్యువు నోడించి తడయక పునరు త్థానము నొందిన ||శ్రీ యేసునే||

Report Error