పల్లవి
శ్రీ యేసుని వేఁడు మనసా సేవింపవే నేఁడు నీ యఘములను బాపియు నిను నెడ బాయక కడు సహాయము జేసెడి ||శ్రీ యేసుని||
1వ చరణం
పాపంబులు వీడి పశ్చా త్తాపబంబును గూడి దాపున జేరుము దయగల ప్రభువు నీ పాపముఁ బాపియుఁ పాలించును ధర ||శ్రీ యేసుని||
2వ చరణం
దేవుని మరువకుము దైవ సేవను మరువకుము జీవపుఁ త్రోవను స్థిరముగ నడువను పావన మనసును బ్రాపుగ నిచ్చెడి ||శ్రీ యేసుని||
3వ చరణం
రక్తము చిందించెఁ ప్రభువు రక్తితో నీ కొరకు రక్తపు టూటల శక్తిని నమ్మిన ముక్తి కలుగును భక్తితో నీవు ||శ్రీ యేసుని||
4వ చరణం
సిలువయే నీ ఘనము క్రీస్తు సిలువయే నీ ధనము సిలువయే భాగ్యము తులువల కెల్లను సిలువ వలననే కలుగును రక్షణ ||శ్రీ యేసుని||