పల్లవి
శ్రీ యెహోవా నీ కొసంగెద శ్రేయ మొదవఁగ నాదు సంపదఁ బాయక నీ సమ్ముఖమ్మున నే యెడ నివసింతు భక్తితో ||శ్రీ యెహోవా||
1వ చరణం
అడఁకువతో నీ పాదములఁబడి యొడయుఁడా నావెల్ల నీకిడి తడవు చేయక కొల్తు నిన్నుఁ దండ్రి నన్నంగీకరించుమి ||శ్రీ యెహోవా||
2వ చరణం
నీవు నా రాజువు నిరతము నేను నీ బిడ్డను నిశ్చయము పావనాత్ముని యెదుట నాదు జీవ మిడుదు సజ్జీవనముకయి ||శ్రీ యెహోవా||
3వ చరణం
ప్రభువరా యర్పించుకొందు భక్తితోడ నన్ను నిందు శుభప్రదము లగు శక్తులతో నను సొంపుమీరఁగ నింపు స్వామీ ||శ్రీ యెహోవా||
4వ చరణం
మహిమస్తుతులు చెల్లు నీ నా మంబునకు నిత్యంబుగా న న్నిహ పరంబుఁ బ్రోచువాఁడ నీవె సుమ్మా లోక రక్షకా ||శ్రీ యెహోవా||