శృంగార దేశము చేరఁగానే నా
shrungaara deeshamu cheeramgaanee naa
పల్లవి
శృంగార దేశము చేరఁగానే నా దుఃఖ బాధలన్నియుఁ బోవున్ యేసుని యొద్దను నిత్యమునే నుండుట మిక్కిలి యాశ్చర్యము ||శృంగార దేశము||
1వ చరణం
అమితమైన కృపవలన నన్ను స్వర్గంబునఁ జేర్చుదురు అచ్చోటనుండి యేసుని గాంచి స్తుతి కీర్తనలు పాడుదును. ||శృంగార దేశము||
2వ చరణం
నేను ప్రేమించు స్నేహితులును అక్కడఁ జూచి సంతోషింతును నాయేసు ముఖము చూచుటయే నిత్యము నాకది యానందము. ||శృంగార దేశము||
3వ చరణం
ఆ స్వర్గ సౌఖ్య మొందువరకు కండ్లతోఁ జూడక పోయినను యేసుని మాటలు గైకొనుచు నాత్మతోఁ జూచి సంతోషింతును ||శృంగార దేశము||