శుభవేళలో నీ మోమును చూసి - అర్పించెదను నన్నూ
shubhaveellaloo nii moomunu chuusi - arpinchedanu nannuu
పల్లవి
ఆరాధన స్తుతి స్తోత్రములు - తండ్రీ నీకేనయ్యా "శుభవేళలో" ఆరాధన - ఆరాధన - ఆరాధన - ఆరాధన నా ప్రియ యేసునకే - పావనాత్మ ప్రభునకే
1వ చరణం
ప్రతిరోజును ప్రతి నిమిషము - నీ తలంపులతో నింపబడాలి -2 నా నోటి మాటలెల్ల - పరుల గాయములు, మా న్పాలి "శుభవేళలో"
2వ చరణం
నీ హృదయ ఆశలన్నియూ - హృదినాడిగా మారాలి - 2 జీవించు రోజులెల్లా - నీసాక్షిగా మారాలి "శుభవేళలో"
3వ చరణం
శుభవార్త భారం ఒక్కటే - నా హృదయ భారమై ఉండాలి - 2 నా దేశం అంచులెల్లా - నీ నామం ప్రకటించాలి"శుభవేళలో"