సీయోను పాటలు సంతోషముగ పాడుచు సీయోను వెళ్లుదము
siiyoonu paattalu santoossamuga paadduchu siiyoonu vellludamu
1వ చరణం
లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు || 2 || పొందవలె ఈ లోకంబునందు కొంతకాలమెన్నో శ్రమలు || 2 ||
2వ చరణం
ఐగుప్తును విడచినట్టు మీరు అరణ్యవాసులై ఈ ధరలో || 2 || నిత్యనివాసము లేదిలలోన - నేత్రాలు కానునుపై నిల్పుడి || 2 ||
3వ చరణం
మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి || 2 || నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము || 2 ||
4వ చరణం
ఐగుప్తు ఆశలన్నియు విడచి రంగుగ యేసుని వెంబడించి || 2 || పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి || 2 ||
5వ చరణం
ఆనందమయ పరలోకంబు మనది అచ్చట నుండి వచ్చునేసు || 2 || సీయోను గీతము సొంపుగ కలసి పాడెదము ప్రభు యేసుకి జై || 2 ||