సిలువ సైనికులారా నిలువండి వడి

siluva sainikulaaraa niluvandi vadi

🎵 TG-358💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

సిలువ సైనికులారా నిలువండి వడి లేచి బలుఁడు యేసుక్రీస్తు ప్రభు దయ జయ మౌను ||సిలువ సైనికులారా||

1వ చరణం

రారాజు పంపున రణము సేయగఁ బూని ధీరులై నిలువుఁడి దినము శత్రుల గెల్వ ||సిలువ సైనికులారా||

2వ చరణం

అతఁడు నిజ ధ్వజ మత్యున్నతి నొంద బ్రతి వీరుని గెల్చు వరకుసేనల నడుపు ||సిలువ సైనికులారా||

3వ చరణం

మీ స్వీయ బలమున మీ రానుకొనకయే మీ స్వామి బలమును మీరు నమ్మి గెలువ ||సిలువ సైనికులారా||

4వ చరణం

శత సహస్రము లైన శత్రుల నెదిరించి సతతము ప్రభు సేవ సల్పి ధైర్యము నొంది ||సిలువ సైనికులారా||

5వ చరణం

దేవుఁ డొసఁగినట్టి దివ్య కవచముఁ దాల్చి భావ ప్రార్థనాసి బట్టి యుద్ధము సేయ ||సిలువ సైనికులారా||

6వ చరణం

జయశీలు రగు వారు చారు కిరీట మంది జయశాలి క్రీస్తు దయ జనెదరు సద్గతికి ||సిలువ సైనికులారా||

Report Error