సిలువలో ఆ సిలువలో ఆ

siluvaloo aa siluvaloo aa

🎵 TG-1437🌐 Telugu
పల్లవి

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2) వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా ||సిలువలో||

1వ చరణం

నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ- మోయలేక మోసావు కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2)        ||వెలి||

2వ చరణం

వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె మోమున ఉమ్మివేయ మౌనివైనావే దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా నాదు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే నాదు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను

Report Error