సిలువలో సాగింది యాత్రా కరుణామయుని దయగల పాత్ర

siluvaloo saagindi yaatraa karunnaamayuni dayagala paatra

🎵 TG-1240💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

ఇది ఎవరి కోసమో.... ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే... "సిలువలో"

1వ చరణం

పాలుగారు దేహముపైనా - పాపాత్ముల కొరడాలెన్నో (2) నాట్యమాడి నాయి నడి వీదిలో నడిపాయి (2) నోరుతెరువ లేదాయె ప్రేమా...బదులు పలుక లేదాయె ప్రేమా ఇది ఎవరి కోసమో.... ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే... "సిలువలో"

2వ చరణం

చెళ్ళుమని కొట్టింది ఒకరు - ఆ మోముపైన ఊసింది మరియొకరు బంతులాడి నారు భాదలను పెట్టినారు (2) నోరుతెరువ లేదాయె ప్రేమా...బదులు పలుక లేదాయె ప్రేమా ఇది ఎవరి కోసమో.... ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే... "సిలువలో"

3వ చరణం

వెనుక నుండి తన్నింది ఒకరు - తనముందు నిలచి నవ్వింది మరియొకరు (2) గేలిచేసి నారు పరిహాస మాడినారు (2) నోరుతెరువ లేదాయె ప్రేమా...బదులు పలుక లేదాయె ప్రేమా ఇది ఎవరి కోసమో.... ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే... "సిలువలో"

Report Error