సిలువలో వ్రేలాడు ప్రభువే విలువ
siluvaloo vreelaadu prabhuvee viluva
సిలువలో వ్రేలాడు ప్రభువే విలువ కందఁగ రాని యీవుల నెలమి మనకై కొనియెఁగల్వరి నిపుడు సాష్టాంగము లొనర్చుచు ||సిలువలో వ్రేలాడు||
కొరత చావయినను మరణము వఱకుఁదనుఁ దగ్గించుకొని మన కొఱకు దాసుండగుచు రిక్తుని కరణి నిట జీవము నొసంగెడు ||సిలువలో వ్రేలాడు||
తనను నమ్మినవారు చావక యనిశ జీవమునొంది బతుకను దన స్వపుత్రుని నిచ్చునంతఁగఁ దండ్రి ప్రేమించెను జగంబును ||సిలువలో వ్రేలాడు||
పాప మెఱుగని వాని మనకై పాపముఁగ నొనరించి దేవుఁడు శాపగ్రస్తులలోన నొకఁడుగ మా ప్రభుండెంచంగఁ బడియెను ||సిలువలో వ్రేలాడు||
లోకమాంస పిశాచులని యెడి భీకారుల పొంగుఁ గృంగను శ్రీ కరుఁ డు మన దేవతనయుం డౌ కృపానిధి దీనుడయ్యెను ||సిలువలో వ్రేలాడు||
ఘోరయుద్ధముఁ జేసివైరిని గూలఁద్రోసిన తావిదే మన పారమార్ధిక బలము కిరువగు ధీర శ్రేష్ఠుఁడు దిశలు ఘళ్లన ||సిలువలో వ్రేలాడు|| దేశ మిత్తు నని శ్రీకరుం డెహోవా సెలవిచ్చెను ||సిలువలో వ్రేలాడు||
శరణు గలదిఁక పాపకోటికి స్వామి ద్రోహపు శత్రులకు సహ కరుణ రుధిర కణాగతంబున కలుష రహిత మనంత రక్షణ ||సిలువలో వ్రేలాడు||
మాకు ప్రేమ సారమయ్యెను మాకు జీవనాధారమయ్యెను మాకుఁ దృప్తి సునీరమయ్యెను మాకుఁ బరమ విచారమయ్యెను ||సిలువలో వ్రేలాడు||
నమ్ముదము సైన్యముల ప్రభువును చిమ్ముదము సందియము లాత్మను క్రమ్ముదము మోక్షపురి బాట సు ఖమ్ము మన హృదయమ్ము లొందను ||సిలువలో వ్రేలాడు||