సిల్వ చెంత నేసువా చేర్చి

silva chentha neesuvaa cheerchi

🎵 TG-340💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

సిల్వ చెంత నేసువా చేర్చి నన్ను నుంచు కల్వరిన్ స్రవించెడు కల్వలో నన్నుంచు. ||సిల్వ చెంత||

1వ చరణం

కంపితాత్ము నంధునై కానలేక యుండ సొంపు మీరఁ బ్రోచితి సూర్యతేజ స్కుండ ||సిల్వ చెంత||

2వ చరణం

దేవ గొఱ్ఱె పిల్ల ఈన దీప్తి నాకుఁ జూపు నీ వధా ప్రభావముల్ పావనుండ నేర్పు. ||సిల్వ చెంత||

3వ చరణం

నే నిరీక్షణంబుతో నెప్డు వేచి యుందున్ భూ నితాంత వారధిన్ బూని యీది మందున్ ||సిల్వ చెంత||

Report Error