సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము

silvaloo naakai kaarchenu yeesu raktamu

🎵 TG-1239💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము

1వ చరణం

సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము

2వ చరణం

సమాధాన పరచును యేసు రక్తము సమస్యలన్ని తీర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము

3వ చరణం

నీతి మంతులుగా చేయును యేసు రక్తము ధుర్నీతినంత బాపును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము నిబంధన నిలుపును యేసు రక్తము

4వ చరణం

రోగములను బాపును యేసు రక్తము దురాత్మన్‌ పారద్రోలును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము శక్తి బలము నిచ్చును యేసు రక్తము

Report Error