స్నేహంపు బంధమా శుభంబు నొందుమా

sneehanpu bandhamaa shubhanbu nondumaa

🎵 TG-606💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

స్నేహంపు బంధమా శుభంబు నొందుమా సత్క్రైస్తవ సావాసము స్వర్గంబుఁ బోలును

1వ చరణం

పంశు పాదముల్ ప్రార్ధించి కొల్తుము భయ, నిరీక్షణాశలు ప్రార్థన లొక్కటే ||స్నేహంపు బంధమా||

2వ చరణం

ఒండొర్ల బాధలన్ ఓదార్చు కొందుము ఒలికెడి కన్నీటితో ఒప్పు మా స్నేహము ||స్నేహంపు బంధమా||

3వ చరణం

వియోగ కాలము విచారమైనను వీలౌ మరలకూడుట విజయ మైత్రితోన్ ||స్నేహంపు బంధమా||

Report Error