స్తుతి స్తుతి సదయుఁడైన యేసు
sthuthi sthuthi sadayumdaina yeesu
పల్లవి
స్తుతి స్తుతి సదయుఁడైన యేసు నూటి న్నీకుసృష్టి చెల్లించును నీతిమంతా నిఖిల దూతలు చేరి నీకే కీర్తి భక్తిఁజెల్లింతురు. చేతనుంచి పిల్లల నెల్లను యేసు మితిలేని ప్రేమను గాచును. ||స్తుతి స్తుతి||
1వ చరణం
స్తుతి స్తుతి సదయుఁడైన యేసు స్తోత్రముల్ మా స్వామికి చెల్లును ప్రీతిన్ మాకై మరణమొందుచు (యేసు ప్రేమఁ జూపి ప్రజలఁబ్రోచితే రాతి కోట వైతివి మాకు నీవు రక్షకుండ కరుణసాగరా. ||స్తుతి స్తుతి||
2వ చరణం
ఆకాశంపు గవునులారా మీరు ఆనంద పాటలను పాడుఁడీ ప్రాకటంబౌ ప్రవక్త గురువు రాజు లోకాంతంబుల్ వెలుఁగ నేలును వీఁక తోడవేగ వచ్చును యేసు వాకంబెల్ల నదురునట్లుగాన్. ||స్తుతి స్తుతి||