స్తుతికి పాత్రుడ యేసయ్యా నా
sthuthiki paathruda yeesayyaa naa
🎵 TG-1768🌐 Telugu
పల్లవి
స్తుతికి పాత్రుడ యేసయ్యా నా స్వాస్థ్య భాగము నీవయ్యా (2) పూర్ణ హృదయముతో పాడి కొనియాడెద నీవే నా రక్షణ – నీవే నా స్వస్థత నీవే నా విడుదల (2) ||స్తుతికి||
1వ చరణం
పాప ఊభిలో నుండి – పైకి లేపితివి మరణ ఛాయను తొలగించి – కరుణ చూపితివి నీ వైపే చూస్తూ – నీతోనే నడుస్తూ నీ వెనకే చేరెద యేసూ (2) ||నీవే||
2వ చరణం
జీవాహారము నీవే – జీవ జలము నీవే నీదు నామమే శక్తి – లేదు ఇలలో సాటి ప్రతి మోకాలొంగును – ప్రతి నాలుక ఒప్పును యేసు రాజా నీ యెదుట