స్తోత్రింతుము నిను మాదు తండ్రీ - సత్యముతో నాత్మతో నెపుడు
stootrintumu ninu maadu tanddrii - satyamutoo naatmatoo nepuddu
పరిశుద్దాలంకారములతో- దర్శించెదము - శరణం ...శరణం
శ్రేష్ట యీవుల నిచ్చినందున - శ్రేష్ట యీవుల యూట నీవే త్రిత్వమై యేకత్వమైన త్రి - యేక దేవా శరణం...శరణం "స్తోత్రింతు"
పాపి మిత్రుడు,పాప నాశుడ - పరమ వాసుడ ప్రేమా పూర్ణడ వ్యోమ పీఠుడ, స్వర్గపూజ్యుడ- పరిశుద్దాంగుడ,శరణం..శరణం "స్తోత్రింతు"
దవళ వర్ణుడ, రత్నవర్ణుడ- సత్యరూపి యనబడువాడ నను రక్షించిన రక్షకుండ- నాధా నీకే శరణం ....శరణం "స్తోత్రింతు"
సంఘమునకు శిరస్సు నీవే - రాజనీకే నమస్కారములు ముఖ్యముగను మూల రాయి - కోట్లకొలది శరణం..శరణం "స్తోత్రింతు"
నీదు సేవకుల పునాదిది - జ్ణానమునకు మించిన తెలివి అందముగను కూడుకొనుచు - వేడెదము శరణం ..శరణం "స్తోత్రింతు"
రాజనీకే స్తుతి స్తోత్రములు - గీతముల మంగళ ధ్వనులు శుభము ,శుభము,శుభము నిత్యము - హల్లెలూయ ఆమెన్, ఆమెన్ "స్తోత్రింతు"