స్తుతి పాడెదను ప్రతి దినము స్తుతి పాడుటయే నా అతిశయము
stuti paaddedanu prati dinamu stuti paadduttayee naa atishayamu
పల్లవి
అ.ప. దవళవర్ణుడా మనోహరుడా - రత్నవర్ణుడా నా ప్రియుడా " స్తుతి"
1వ చరణం
ఆరాధించెద అరునోదయమున - అమరుడ నిన్నే ఆశతీర - 2 ఆశ్రిత జనపాలకా - అందుకో నా స్తుతి మాలిక "దవళ"
2వ చరణం
గురి లేని నన్ను ఉరి నుండి లాగి - ధరి చేర్చినావే పరిశుద్ధుడా - 2 ఏమని పాడెద దేవా - ఏమని పొగడెద ప్రభువా "దవళ"
3వ చరణం
మతిలేని నన్ను శృతిచేసినావే - మృతినుండి నన్ను బ్రతికించినావే - 2 నీ లత నై పాడెద దేవా - నా పతివని పొగడెద ప్రభువా "దవళ"