స్తుతించెదను - నిన్ను నేను మనసారా
stutinchedanu - ninnu neenu manasaaraa
పల్లవి
భజించెదను - నేను నిన్ను దినదినము స్తోత్రార్హుడవు - నీవే ప్రభూ సమస్తము నీ కర్పించెదను
1వ చరణం
పూజార్హుడవు - పవిత్రుడవు పాపిని క్షమియించె - మిత్రుడవు పరము చేర్చి - ఫలములిచ్చే పావనుడగు మా - ప్రభువు నీవే ||స్తుతించెదను||
2వ చరణం
కృపాకనికరములు - గల దేవా కరుణ జూపి - కనికరించు కంటిరెప్పవలె - కాపాడు కడవరకు మమ్ము - కావుమయా ||స్తుతించెదను||
3వ చరణం
సర్వశక్తి గల - మా ప్రభువా సజీవ సాక్షిగా - చేయుమయా స్థిరపరచి మమ్ము - బలపరచుము సదా నీకె స్తోత్రాలర్పింతున్ ||స్తుతించెదను||