సుగుణాల సంపన్నుడా - స్తుతిగానాలవారసుడా
sugunnaala sanpannuddaa - stutigaanaalavaarasuddaa
పల్లవి
జీవింతును నిత్యము నీ నీడలో - ఆస్వాదింతును నీ మాటల మకరందము
1వ చరణం
యేసయ్య నీతో జీవించగానే - నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము - ఇది రక్షణానంద భాగ్యమే "సుగుణాల"
2వ చరణం
యేసయ్య నిన్ను వెన్నంటగానే - ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు - నేను నడువ వలసిన త్రోవలో "సుగుణాల"
3వ చరణం
యేసయ్య నీ కృప తలంచగానే - నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదుట - ఇవి ఎన్న తగినవి కావే "సుగుణాల"