స్వీకరించుమయా నాథా స్వీకరించుమయా ఈ

sveekarinchumayaa naathaa sveekarinchumayaa ee

🎵 TG-2544🌐 Telugu
పల్లవి

స్వీకరించుమయా నాథా స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా స్వంతమేది నాది లేదు నిజాము నా దేవా నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు ||స్వీకరించుమయా||

1వ చరణం

నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని (2) జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవొసగి ప్రేమ యినెడి భాగ్యమును పంచిపెట్టుమయా సుతుని ద్వారా పితకు నేనిల బలిని అర్పింతు ఆత్మ దేహములత్యంత అయోగ్యమైనవి అమరమైన నీ ప్రేమతో నన్ను నింపుమయా పుణ్య జీవిత భాగ్యమును పంచిపెట్టుమయా

Report Error