తల్లి ఒడిలో పవళించే

talli odiloo pavalinchee

🎵 TG-1065💿 Telugu Christian Songs🌐 Telugu
1వ చరణం

వేదన లేదు శోధనలేదు - నీ హస్తము విడువనయ్యా - 2 భయమన్నది లేనే లేదు - ప్రేమతో నడిపితివి నను ప్రేమతో నడిపితివి

2వ చరణం

నీ ఉపకారం స్మరియించి - స్తుతిస్తోత్రం తెలిపెదను నే స్తుతిస్తోత్రం తెలిపెదను. చేయివిడువని నా యేసయ్యా - కల్వరినాయకుడా నా కల్వరి నాయకుడా.

3వ చరణం

మంచికాపరి జీవకాపరి - హృదయా పాలకుడా నా హృదయ పాలకుడా ఆహారమై వచ్చితివా - ఆత్మతో కలసితివా నా ఆత్మతో కలిసితివా.

4వ చరణం

నిన్ను నేను పట్టుకొంటిని - భుజముపైన సోలెదను నీ భుజముపైన సోలెదను. నీ రెక్కల నీడలోనుండి - లోకాన్ని మరచితిని ఈ లోకాన్ని మరచితిని

5వ చరణం

రేయింపవలు వెతికానయ్యా - నీకై వేచితిని నే నీకై వేచితిని నా జీవితకాలమంతా - నీ నామం చాటెదను నే నీనామం చాటెదను

Report Error