తొలకరి వాన దీవెనలు కురిపించు

tholakari vaana deevenalu kuripinchu

🎵 TG-2798🌐 Telugu
పల్లవి

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును (2)        ||తొలకరి||

1వ చరణం

ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపచేయును ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును (2)            ||అది నూతన||

2వ చరణం

సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించును పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును

Report Error