త్రిత్వైకమా సకలేశ్వరా పూజ్యుడౌ శ్రేయస్కరా
thrithvaikamaa sakaleeshvaraa puujyudau shreeyaskaraa
🎵 TG-2132🌐 Telugu
పల్లవి
త్రిత్వైకమా సకలేశ్వరా పూజ్యుడౌ శ్రేయస్కరా (2) ధ్యానించెద హృది వాంఛతో గళమెత్తెద మృదు భాషతో నా సుతుడా సర్వే సుతుడా నా జనకా సర్వే జనకా ||త్రిత్వైకమా||
1వ చరణం
దోష భావముకు బంధునవ్వగా దేహ ఇఛ్చలలో స్థిరమవ్వగా వాక్యపు వెలుగై నాకిల వెలుగై ముక్తినిచ్చిన నీకు వందనం (2) ||త్రిత్వైకమా||
2వ చరణం
క్షితియందు ఎరకు మోసిపోతిని క్షమలేక ఇలలో మృతమైతిని వెల దాతవై జీవ దాతవై స్థితి మార్చిన నీకు వందనం (2) ||త్రిత్వైకమా||