త్యాగమెంత చేసావు దేవా నా

thyaagamentha cheesaavu deevaa naa

🎵 TG-2048🌐 Telugu
పల్లవి

త్యాగమెంత చేసావు దేవా నా పాపమంత కడిగావా నేస్తం (2) ఓ యేసయ్యా… నా నేస్తమా… (2)        ||త్యాగమెంత||

1వ చరణం

గెత్సేమనే తోటలో ఒంటరివై మిగిలావా ఒంటరి నా బ్రతుకులో ఓదార్పువయ్యావా కన్నీరు తుడిచి కల్వరికి నడిచావా (2)      ||ఓ యేసయ్యా||

2వ చరణం

తల వాల్చుటకైన నీకు తావే లేదుగా తల్లడిల్లు నాకు త్రోవ చూపించినావా స్వస్థత నాకిచ్చి సిలువ నీవు మోసావా (2)        ||ఓ యేసయ్యా||

Report Error