ఉన్నట్టు నేను వచ్చెదన్ పాపిష్ఠు

unnattu neenu vachchedan paapisstthu

🎵 TG-334💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఉన్నట్టు నేను వచ్చెదన్ పాపిష్ఠు న్నీవు పిల్వఁగన్ నీ నెత్రుచేతఁ గడ్గుమా యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!

1వ చరణం

ఉన్నట్టు నేను వచ్చెదన్ నే నొప్పుకొందుఁ దప్పులన్ నీ మాటతో హరించుమా యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా! ||ఉన్నట్టు నేను||

2వ చరణం

ఉన్నట్టు నేను వచ్చెదన్ దుఃఖంబు బాధపర్చఁగన్ బాపంబుఁ జేయనీకుమా యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా! ||ఉన్నట్టు నేను||

3వ చరణం

ఉన్నట్టు నేను వచ్చెదన్ యేసూ, కబోది నుండగన్ ఆత్మీయదృష్టి నీయుమా యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా! ||ఉన్నట్టు నేను||

4వ చరణం

ఉన్నట్టు నేను వచ్చెదన్ నీ మాట నమ్మునట్టి నన్ మన్నించి చేర్చుకొమ్మయా యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా! ||ఉన్నట్టు నేను||

5వ చరణం

ఉన్నట్టు నేను వచ్చెదన్ నీ ప్రేమ నన్నుఁ బిల్వగన్ నీ వాఁడ నౌదు సర్వదా యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా! ||ఉన్నట్టు నేను||

Report Error