ఊహకు అందని కార్యముల్ ఊహించని

uuhaku andani kaaryamul uuhinchani

🎵 TG-1830🌐 Telugu
పల్లవి

ఊహకు అందని కార్యముల్ ఊహించని రీతిలో నాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించని మేలులన్ నాకై చేసిన దేవా ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్ నీదు నామ గీతము నాదు జీవితాంతము కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్ ||ఊహకు||

1వ చరణం

కనబడవు మా కళ్ళకు – మరి వినబడవు మా చెవులకు ఊహలకే అస్సలందవు – ప్రభు నీ కార్యముల్ (2) అడుగువాటి కంటెను – ఊహించు వాటి కంటెను అద్భుతాలు చేయగా – వేరెవరికింత సాధ్యము అసాధ్యమైనదేది నీకు లేనే లేదు ఇల నీకు మించి నాకు దైవమెవరున్నారు (2)       ||ఉత్సహించి||

2వ చరణం

బండ నుండి నీళ్లను – ఉబికింపజేసినావుగా ఎడారిలో జల ధారలు – ప్రవహింపజేసినావుగా కనుపాప లాగ నన్ను కాచే దైవం నీవు నడి సంద్రమైన నన్ను నడిపే తోడే నీవు

Report Error