ఊహించలేనయ్యా వివరించలేనయ్యా ఎనలేని నీ
uuhinchaleenayyaa vivarinchaleenayyaa enaleeni nee
🎵 TG-2927🌐 Telugu
పల్లవి
ఊహించలేనయ్యా వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను (2) నా జీవితాంతం ఆ ప్రేమలోనే తరియించు వరమే దొరికెను (2) ||ఊహించ||
1వ చరణం
నా మనసు వేదనలో – నాకున్న శోధనలో ఉల్లాసమే పంచెను ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో మధురామృతమునే నింపెను అనాథయిన నను వెదకెను ప్రధానులలో ఉంచెను నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో నీ ప్రేమ రుజువై నిలిచెను వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో నా హృదయమే కరిగెను ఇది నీ ప్రేమకే సాధ్యము వివరించుట నాకసాధ్యము