వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో
vaadabaarani vishvaasamuthoo shubhapradamaina nireekssannathoo
🎵 TG-1923🌐 Telugu
పల్లవి
వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో (2) వేచియున్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా యేసయ్యా నీ రాక కోసమై – కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై – నిన్ను చేరుటకై (2) ||వాడబారని||
1వ చరణం
మోకాళ్లపై వేచితి – కన్నీళ్ల పర్యంతమై బీడు బారిన నేల వానకై – ఎదురు చూచినా సంఘమై సిద్ధపడియున్న వధువునై ఆశతో వేచానయ్యా ||నీ రాక||
2వ చరణం
లేఖనములను చూచితి – గురుతులు గమనించితి ప్రవచన నెరవేర్పులన్ని – జరుగుట గుర్తించితి రారాజువై నీవు రావాలని ఎదురు చూచుచున్నానయ్యా నీటి కొరకై వేచిన – గూడ బాతును పోలిన ఆత్మ దాహము తోడనిండి – అల్లాడుచున్నానయ్యా లోక బంధాల నుండి నీ చెలిమి కోరానయ్యా