వచ్చుచుండెన్ త్వరలోనే - రాజుల రాజుగా యేసయ్యా
vachchuchundden tvaraloonee - raajula raajugaa yeesayyaa
1వ చరణం
తుఫాను వెంబడి తుఫానులు - ఎన్నడు ఎరుగని సునామియు -2 గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
2వ చరణం
వరదల వెంబడి వరదలతో - అనేక ప్రాంతపు కరువులను -2 గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
3వ చరణం
ఎన్నడు లేని రోగములు - ధారుణమైన మరణములు -2 గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
4వ చరణం
భయంకరమైన బాంబులతో - యుద్ధము వెంబడి యుద్ధములు -2 గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
5వ చరణం
అతి తరచుగ భూకంపములు - ధారుణమైన రోధనలు -2 గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు