వచ్చును క్రీస్తు వచ్చును భూలోకమునకు
vachchunu kreesthu vachchunu bhuulookamunaku
వచ్చును క్రీస్తు వచ్చును భూలోకమునకు వచ్చును క్రీస్తు వచ్చును చెచ్చెరను మేఘములపె రవ మిచ్చు బూర సునాదములతో హెచ్చుగను దూతస మూహము లచ్చుగను సేవింపగ్రక్కున ||వచ్చును క్రీస్తు||
అంతటను సకల భూజనులు వింతగను బూర ధ్వనియు విని నంతలోనె సజీవులై ప్రభు చెంత నిల్తు రపార మహిమను ||వచ్చును క్రీస్తు||
ఒనరగనుఁదన మేఘ సింహా సనముపైఁ గూర్చుండి పావన జనుల బారుల నిరుపార్శ్వము లను విభజనముఁ జేయు నిక్కము ||వచ్చును క్రీస్తు||
అదను నిది యని హృదయములు ప్రభు పదయుగళ సున్నతియెఱుంగక మద దు రేచ్ఛల గెదరు పాపుల హృదయములు చెదరి భీతిల్లఁగ ||వచ్చును క్రీస్తు||
అమిత పాపాత్ముల నరకలో కమునఁ బడవైచి సుజన సమూ హముల దనవెను వెంటఁ గొని చను విమల నిత్య కిరీటము లొసఁగఁ ||వచ్చును క్రీస్తు||
తల్లి పిల్లల నెడబాసియు నల్లకల్లోలముగ భువిపై తల్లడిల్లుచు నొకరి నొక్కరు నెల్లకాలము జూడని గడియ ||వచ్చును క్రీస్తు||