వందనం బొనర్తుమో ప్రభో ప్రభో

vandanam bonarthumoo prabhoo prabhoo

🎵 TG-601💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి, తనయ, శుద్ధాత్ముఁడా వదనంబు లందు కో ప్రభో ||వందనం బొనర్తుమో||

1వ చరణం

ఇన్ని నాళ్లు ధరను మమ్ముఁ బ్రోచియుఁ గన్న తండ్రి మించి యెపుడు గాచియు ఎన్నిలేని దీవెన లిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రము లివిగో ||వందనం బొనర్తుమో||

2వ చరణం

ప్రాత వత్సరంపుఁ బాప మంతయుఁ బ్రీతిని మన్నించి మమ్ముఁ గావుము నూత నాబ్దమనను నీదు నీతి నొసఁగు మా దాత క్రీస్తు నాధ రక్షకా ||వందనం బొనర్తుమో||

3వ చరణం

దేవ మాదు కాలుసేతు లెల్లను సేవకాళి తనువు దినము లన్నియు నీ వొసంగు వెండి, పసిడి జ్ఞాన మంత నీ సేవకై యంగీకరించుమా ||వందనం బొనర్తుమో||

4వ చరణం

కోఁతకొరకు దాసజనము నంపుము ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము పాతకంబు లెల్ల మాపి భీతిఁ బాపుము ఖ్యాతి నొందు నీతి సూర్యుఁడా ||వందనం బొనర్తుమో||

5వ చరణం

మా సభలకు పెద్దజేసి పెంచుము నీ సువార్త జెప్ప శక్తి నీయుము మోసపుచ్చు నంధకార మంతఁ ద్రోయుము యేసు కృపన్ గుమ్మరించుము ||వందనం బొనర్తుమో||

Report Error