వర్షింపనీ వర్షింపనీ నీ ప్రేమ

varssinpanee varssinpanee nee preema

🎵 TG-2580🌐 Telugu
పల్లవి

వర్షింపనీ వర్షింపనీ నీ ప్రేమ జల్లులు మాపై వర్షింపనీ (2) నీ వాక్యపు చినుకుతో జీవింపనీ యేసయ్యా.. నీ ఆత్మ వర్షంతో ఫలియింపనీ (2)       ||వర్షింపనీ||

1వ చరణం

ఎడారి బ్రతుకులో నీ వాక్య చినుకు కురిపించి సజీవ ధారలతో ప్రతి కఠిన గుండెను తాకి ఆశతో ఉన్నవారికి నీ వాక్కుతో ప్రాణం పోయనీ (2)        ||వర్షింపనీ||

2వ చరణం

ఎండిన జీవంపై నీ ఆత్మ వర్షం కుమ్మరించి సజీవ జలములపై పొంగి ప్రతి చోటకు సాగి దాహం గొన్న వారికి నీ ఆత్మలో సకలం పొందనీ (2)       ||వర్షింపనీ||

Report Error