విడువవు నన్నిక ఎన్నడైననూ పడిపోకుండా

viduvavu nannika ennadainanuu padipookundaa

🎵 TG-1766🌐 Telugu
పల్లవి

విడువవు నన్నిక ఎన్నడైననూ పడిపోకుండా కాయు రక్షకా (2) పడిపోవు వారెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభు (2)     ||విడువవు||

1వ చరణం

ప్రభువా నీకవిధేయుడనై పలు మారులు పడు సమయములలో ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నను పైకెత్తితివి ఆదాము హవ్వలు ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను సిలువకు చాయగా బలినర్పించి ప్రియముగా విమోచించితివి మా శక్తియు మా భక్తియు కాదు ఇలలో జీవించుట ప్రభువా కొల్లగా నీ ఆత్మను నొసగితివి హల్లెలూయా పాడెదను

Report Error