విలువైన నీ కృప నాపై
viluvaina nee krupa naapai
🎵 TG-2751🌐 Telugu
పల్లవి
విలువైన నీ కృప నాపై చూపి – కాచావు గత కాలము ఎనలేని నీ కృప నాపై ఉంచి – ఇచ్చావు ఈ వత్సరం దినములు సంవత్సరాలు గడచిపోయెను ఎన్నో ప్రతి దినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలో నా జీవిత కాలమంతా నను నడుపుము యేసయ్యా నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్యా (2) ||విలువైన||
1వ చరణం
గడచినా కాలమంతా తోడైయున్నావు అద్భుతాలు ఎన్నో చేసి చూపావు (2) లెక్కించ లేని మేలులతో తృప్తి పరిచావు నీ కరుణా కటాక్షములు నాపై ఉంచావు (2) ||నా జీవిత||
2వ చరణం
సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా నూతన కార్యాలు ఎన్నో చేశావు సంవత్సరమను నీ దయా కిరీటం ధరింప చేశావు నా దినములు పొడిగించి నీ కృపలో దాచావు మా దినములు పొడిగించి నీ కృపలో దాచావు ||నా జీవిత||