వినరే నరులారా మనముల వేడుకలను

vinaree narulaaraa manamula veedukalanu

🎵 TG-271💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

వినరే నరులారా మనముల వేడుకలను మీర మన, రక్షకుఁడగు మరియా తనయుని మహిమలు చెవులార ||వినరే నరులారా||

1వ చరణం

తన కన్నను ముందు యోహా నను నతఁ డింపొందు ఘనతర మగును ప్రవచనముఁబ ల్కెను భూజను లందు ||వినరే నరులారా||

2వ చరణం

అతఁడు యోర్దాను నదిలో ఖ్యాతిగ ననుదినమున్ పాతకులకు బా ప్తిస్మ మిచ్చు నెడం ప్రభు వచ్చటి కరిగెన్ ||వినరే నరులారా||

3వ చరణం

న్యాయము నిలుపుటకై ప్రభుని వి ధేయతఁ గనుపఱచి శ్రేయ పతి బొం దెను యోహానుని చేత బాప్తిస్మంబు ||వినరే నరులారా||

4వ చరణం

పరమండల మపుడు తెరవం బడి పావురము గతిన్ పరిశుద్ధాత్మ శు భప్రభ లీనుచుఁ ప్రభువు మీఁద వ్రాలెన్ ||వినరే నరులారా||

5వ చరణం

ఆకాశమునుండి కలిగెను ప్రాకటమగు రవము నా కితఁడు ప్రియం బౌ కుమారుఁడా నంద మొంది రనుచు ||వినరే నరులారా||

6వ చరణం

అంతట మన కర్త పరిశుద్ధాత్మ బలము కలిమిన్ సంతసమున మో క్ష కుశలవార్తను జాటంగను దొడఁగెన్ ||వినరే నరులారా||

7వ చరణం

ఆ నిత్య సువార్త మన మెద లో నిడి నమ్మినచో నానందమయం బమృత మేసు ద యా నిధి మన కొసంగున్ ||వినరే నరులారా||

Report Error